భారత స్వతంత్ర దినం నేరమా? జంపన్న
*ఆగస్ట్ 15 భారత స్వాతంత్ర్య దినంగా జరుపు కావాలా? బహిష్కరణ చేయాలా?
శతాబ్దాలుగా బ్రిటిష్ సామ్రాజ్య వాదుల వలస దోపిడీ కి వ్యతిరేకంగా సాయుధము గా నిరాయుధంగ కోట్లాది భారత ప్రజలు అనేక చారిత్రాత్మక పోరాటాలు కొనసాగించిన వుజ్వల చరిత్ర ఆగస్ట్ 15 గుర్తు చేస్తుంది.
వేలాది మంది ప్రజలు ప్రజా నాయకులు వీరోచిత త్యాగ ఫలితమే భారత దేశంలో బ్రిటిష్ సామ్రాజ్య వాదులు తమ వలస పాలనను వదులుకున్నారు.
బ్రిటిష్ సామ్రాజ్యవాద వలస విధానానికి వ్యతిరేకంగా అనేక రైతాంగ ఉద్యమాలు సిపాయిల తిరుగు బాటు గదర్ వీరులు భగత్ సింగ్ లాంటి సాయుధ ఉద్యమ కారుల తో పాటు గా కాంగ్రెస్ ,భారత కమ్యునిస్ట్ పార్టీ లు దేశ వ్యాపితంగా ఉద్యమాలు నిర్మించినాయి
*కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర పోరాటం లో అనేక రాజీలు,వూగిసలాట,కప్ప గంతులు ఎన్ని వున్నప్పటికీ ఆనాటి జాతీయ ఉద్యమం లో దాని కీలక పాత్ర ఉన్నదనే విషయం గుర్తించ వలసిందే.కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లో చిన్న భూస్వామ్య వర్గం వున్నప్పటికీ బూర్జువా వర్గం మాత్రమే నాయకత్వం వహించింది.
*కమ్యూనిస్ట్ పార్టీ అనేక పోరాటాలు త్యాగాలు చేసినప్పటికీ అనాడు కొనసాగుతున్న జాతీయ ఉద్యమంలో సరి అయిన నాయకత్వ పాత్ర వహించలేదు .
గందర గోలానికి గురి అయింది.ఒక సందర్భంలో కాంగ్రెస్ కు పూర్తి వ్యతిరేకంగా మరొక సందర్భం లో దాని వెనుకాల నడవటం లో స్వతంత్ర కమ్యునిస్ట్ విధానం లేదు.
కమ్యునిస్ట్ పోరాటాలు త్యాగాలు ఎన్ని చేసినప్పటికీ బ్రిటిష్ సామ్రాజ్య వాదులు కాంగ్రెస్ పార్టీ రాజీ కుమ్ముక్కు ఉద్యమాన్ని బహిర్గతం చేసి భారత స్వతంత్ర ఉద్యమానికి బల మైన నాయకత్వం వహించ లేదు.
*బిజెపి పూర్వ సంస్థ జనసంఘ్( సంఘ్ పరివార్) పూర్తిగా మనువాద బావ జాలం పై ఆధార పడిన పెద్ద భూస్వాములు పెద్ద మర్వాడి వ్యాపారస్తుల తో కూడి వున్న స్వాతంత్ర్య ఉద్యమ వ్యతిరేక సంస్థ మాత్రమే.
అది పూర్తిగా భూస్వాములతో పాటు సామ్రాజ్య వాదులకు పూర్తి మద్దతు ఇచ్చి ప్రజా ఉద్యమాలకు వ్యతిరేకంగా కత్తి గట్టి బ్రిటిష్ ఏజెంట్ గిరి చేసిన సంస్థ మాత్రమే.
*దేశీయంగా అంతర్జాతీయంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా కమ్యునిస్ట్ ల నాయకత్వం లో బూర్జువా పార్టీ ల నాయకత్వం లో వలస వ్యతిరేక ఉద్యమాలు ప్రపంచం లో చుట్టూ ముట్టినవి.
1917 లో రష్యాలో సోషలిస్ట్ విప్లవ విజయం తో ప్రపంచ వ్యాపితంగా వుప్పెన వలే ఉద్యమాలు ఎగసి పడి చైనా తో పాటు మరి కొన్ని దేశాల్లో కమ్యునిస్ట్ విప్లవ విజయాలు ముంగిట్లో వున్న కాలం.
వలసల కోసం సామ్రాజ్య వాదుల మధ్య రెండవ ప్రపంచ యుద్ధం కొనసాగుతున్న కాలం.హిట్లర్ ఫాసిజం ప్రపంచ ప్రజలకు ప్రధాన ప్రమాదం గా ముందుకు వచ్చిన కాలం
బ్రిటిష్ ప్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ వగైరా సామ్రాజ్య వాదుల వలస పాలన కు తెర పడుతున్న కాలం అనే విషయం దృష్టి లో పెట్టుకుంటే అనాడు బ్రిటిష్ సామ్రాజ్య వాదులు కాంగ్రెస్ తో అర్థ రాత్రి ఒప్పందం చేసుకున్న చరిత్ర అర్థం అవుతుంది.
ఈ ఒప్పందం చేసుకోక పోతే వలస పాలకులను ప్రజలు తన్ని తరిమి కొట్టే వారు .
* వలస వాదులు ఈ దేశం నుండి 1947 ఆగస్ట్ 15 న వదిలి పెట్టడం భారత దేశానికి స్వాతంత్రము అవుతుంది.
స్వాతంత్రము అంటే కమ్యూనిస్ట్ లు సాదించాలనుకున్న సోషలిస్ట్ లేదా నూతన ప్రజాస్వామ్యం విప్లవాలు కాదు.
కమ్యూనిస్టుల నాయకత్వంలో కనుక వలస వ్యతిరేక ఉద్యమం విజయ వంతం అయితే ప్రజలకు స్వాతంత్ర్యము మాత్రమే కాదు అది నూతన ప్రజాస్వామిక విప్లవ విజయం అవుతుంది.
స్వాతంత్య్రం అంటే బూర్జువా వర్గ నాయకత్వంలో సామ్రాజ్య వాద దేశాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమమ పలితంగా సామ్రాజ్య వాదులను తరిమి వేయడం స్వాతంత్ర్యం అంటారు
పారిస్ కమ్యూన్ తరువాత ప్రత్యేకించి రష్యా సోషలిస్ట్ విప్లవం విజయవంతం అయిన తరువాత బూర్జువా నాయకత్వం లో ప్రపంచ వ్యాపితముగా జరిగిన స్వతంత్ర పోరాటాలు అనేక రాజీల తో బేరసారాల తో లోంగు బాటు వైఖరులతో కొనసాగినవి.
ప్రపంచం లో జరిగిన స్వాతంత్ర పోరాటాలు అన్నీ బూర్జువా నాయకత్వంలో జరిగినవే.
స్వాతంత్ర్యం అంటే బూర్జువా వర్గానికే స్వాతంత్య్రం ప్రదానం వుంటూ ప్రజలకు దక్కే స్వతంత్ర ఉద్యమ పలితాలు నామ మాత్ర మైనవి.
ప్రపంచం లో ఎక్కడైనా అదే జరిగింది.పోరాడేది త్యాగాలు చేసేది మాత్రం ప్రజలు కమ్యునిస్ట్ లు కానీ పలితాలు పొందుతున్నది బూర్జువా వర్గం .
సామ్రాజ్య వలస పాలనను తుద ముట్టించడం లో భారత ప్రజల పాత్ర వీరోచిత మైనది.
భగత్ సింగ్, ఆజాద్ చంద్ర శేఖర్, అల్లూరి సీతారామరాజు, కొమురం భీం, బిర్సా ముండా, సుభాస్ చంద్ర బోస్ లాంటి గొప్ప స్వతంత్ర ఉద్యమ నాయకుల స్ఫూర్తిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం వున్నది.
1947 ఆగస్ట్ 15 తరువాత నుండి భారత బూర్జువా వర్గం నాయకత్వంలో భూస్వాముల, పెట్టుబడిదారుల,సామ్రాజ్య వాదుల ప్రయోజనాల కోసం పని చేస్తూ ప్రజలను దోపిడీ అణిచివేతకు వివక్ష లకు గురి చేయడంలో వారి వర్గ పక్షపాత దోరణి నేడు మరింత బహిర్గత మవుతున్నది.
ప్రజల పై దోపిడీ అణిచివేత వివక్ష నియంతృత్వం పెరిగింది. ప్రజా స్వామ్యం అనేది బూర్జువా వర్గానికి సంపన్నులకు మాత్రమే తప్ప సాధారణ ప్రజలు ఓటింగ్ యంత్రాలు అయినారు
కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం మరింతగా పెట్టుబడి దారుల ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తుంగలో తొక్కి మతోన్మాద విధానాలతో ప్రజలను విభజించి పాలించడంలో ఫాసిస్ట్ ప్రభుత్వంగా దేశ ప్రజల వ్యతిరేకతకు గురి అవుతున్నది
*స్వాతంత్ర దినం జరుపుకోవడం అంటే వలసవాద ఆంగ్లేయులకు వ్యతిరేకంగా సాయుధంగా ,నిరాయుదంగా పోరాడిన కోట్లాది వీర ప్రజల యోధుల పోరాట తత్వాన్ని ,త్యాగాన్ని ఎత్తిపట్టాలి.
*బ్రిటిష్ పాలకులకు తొత్తులుగా పనిచేసి ,ప్రజా పోరాటాలకు బద్ద వ్యతిరేకి,ప్రజలపై ఫాసిస్ట్ నియంతృత్వాన్ని అమలు చేసే బిజెపి ,ఆర్ యస్ యస్ లకు స్వాతంత్ర దినోత్సవం జరిపే నైతిక అర్హత లేదు.
*స్వాతంత్ర్య పోరాట సంప్రాదాయాన్ని కొనసాగించడం అంటే నేడు నిజమైన ప్రజాస్వామ్యం కోసం ,సోషలిజం కోసం పోరాడటమే .
*ప్రజలకు నిజమైన స్వాతంత్రం సమానత రావాలంటే ప్రజల ప్రజాస్వామ్య అధికారం కోసం సోషలిజం కోసం పోరాడాలి .
*స్వతంత్ర సమర యోధుల స్ఫూర్తిని ఎత్తిపట్టి పెట్టుబడి దారీ ఫాసిజాన్నీ వ్యతిరేకించండి
జంపన్న