భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

4

ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానం, ఇంటర్నేషనల్ మార్కెట్ల నెగిటివ్ ట్రేడింగ్ తో భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. పనామా పేపర్స్ లీక్, క్రూడ్ ఆయిల్ ధరలు పతనమవ్వడం కూడా ఇందుకు దోహదపడ్డాయి. దాంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 516 పాయింట్ల నష్టంతో 24వేల 883 దగ్గర క్లోజయింది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 156 పాయింట్ల నష్టంతో 7వేల 603 దగ్గర ముగిసింది. బీపీసీఎల్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, హెచ్‌సీఎల్‌, లుపిన్‌ షేర్లు లాభపడగా.. అదానీ పోర్ట్స్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌ టెల్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు నష్టపోయాయి. మరో పక్క యూరోపియన్‌ మార్కెట్లు పూర్తిగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.