భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
హైదరాబాద్, జనంసాక్షి: భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 329 పాయింట్ల నష్టంతో 19733 పాయింట్ల వద్ద, నిఫ్టీ 112 పాయింట్ల పతనంతో 5982 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. జపాన్ సూచీ నికాయ్ 7 శాతం నష్టంతో 1143 పాయింట్లు కోల్పోయింది. హ్యాంగ్ సెంగ్ 526, తైవాన్ ఇండెక్స్ 161 పాయింట్లు నష్టపోయాయి.
సూచీ అధారిత కంపెనీ షేర్లలో రాన్ బాక్సీ సుమారు 9 శాతం , జయప్రకాశ్ 8 శాతం, డీఎల్‌ఎఫ్ 7 శాతానికి పైగా నష్టపోగా, రిలయన్స్ ఇన్‌ఫ్రా, మారుతి సజుకిలు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఓఎన్ జీసీ, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, టీసీఎస్, అల్ట్రా టెక్ సిమెంట్‌లు స్వల్ప లాభాలను నమోదు చేసుకున్నాయి.