భారీ లాభాలతో ముగిసిన సెన్సెక్స్
ముంబయి: భారతీయ స్టాక్ మార్కెట్ మంగళవారం భారీ లాభాలను నమోదు చేసింది. సెన్సెక్స్ 305.07 పాయింట్ల ఆధిక్యంతో 18,842.08 పాయింట్ల వద్ద నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ 91,55 పాయింట్ల లాభంతో 5727.45 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ, లోహ.. తదితర రంగాలకు చెందిన షేర్లకు మదుపర్ల నుంచి మంచి ఆదరణ లభించింది.