భారీ వర్షపు నీటితో మునిగిన ఇంటిలోని నిరుపేద అనాధలను -వెంటనే ఆదుకోవాలి.
తొర్రూరు 22 జూలై( జనంసాక్షి )
మండలం లోని వెలికట్ట గ్రామంలో కొమ్ము మహేందర్, కొమ్ము అనిల్ ఉంటున్న నివాసంలోకి భారీ వర్షం కారణంగా ఇంటిలోనికి నీరు చేరడం జరిగింది.అసలే పేద బ్రతుకులు అందులో తల్లి తండ్రి మరణించడం జరిగింది.ప్రమాదవశాత్తు వరి నాటు వేయడం కోసం కూలికి వెళ్లిన రోజున పిడుగుపాటుతో మృతి చెందడం జరిగింది తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు తల్లి కొమ్ము సాయమ్మ పిడుగుపాటుతో మృతి చెందడం వల్ల ప్రభుత్వం నుండి వచ్చే నష్టపరిహారం కూడా రాలేదు ఇద్దరు కుమారులు అనాధలుగా ఉన్నారు ఈ భారీ వర్షాల కారణంగా ఉన్న ఒక్క ఇల్లు కూడా నీటిలో మునిగడం జరిగింది. అందులో ఉన్న కొద్దిపాటి సామాన్లు బియ్యం పప్పు ఉప్పులు అన్ని నీటిలో తడిసి ముద్దవ్వడం జరిగింది. ఏం తెలియని స్థితిలో ఇద్దరు కుమారులు కన్నీటి బాధతో ఉన్నారు.చీకటి పడితే ఎలా ఉండాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ప్రభుత్వం నుండి నష్టపరిహారం ఇవ్వాలని, డబుల్ బెడ్ రూమ్ మంజూరి చేయాలని కోరుకుంటున్నారు.రెండవ వార్డు సభ్యులు పబ్బాల రాము, కొమ్ము వినయ్, కొమ్ము వెంకటేష్, కట్ల సారయ్య పరిశీలించారు