భారీ వర్షాలకు ఇందుర్తి నుంచి కోహెడ రాకపోకలకు అంతరాయం

జనంసాక్షి /చిగురుమామిడి- ఆగష్టు 3:
మండలంలోని అన్ని గ్రామాలల్లో నిండిన చెరువులు కుంటలు భారీగా మత్తడి దుంకుతున్నాయి. నీట మునిగిన పంట పొలాలు
పొంగిపొర్లుతున్న ఎల్లమ్మ వాగు మంగళవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి ఇందుర్తి కోహెడ మెయిన్ రోడ్డు పై ఉన్న బ్రిడ్జి పై నుండి భారీగా నీరు ప్రవహిస్తుండడంతో సిద్దిపేట జిల్లాలోని కోహెడ మండలం నుండి ఇందుర్తి మీదుగా కరీంనగర్ జిల్లాకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎవరు వాగు దాటకుండా లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఇందుర్తీ రెడ్డి సంఘం అధ్యక్షులు గాదే రఘునాథ్ రెడ్డి, చెప్పాల సంతోష్, తోట హనుమాన్లు, ఎండీ నశిరుద్దీన్ ముళ్ళ కంచె అడ్డంగా వేయడం జరిగింది. ఈ రోడ్డుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని పలువురు బాటసారిలు కోరుతున్నారు. భారీగా కురిసిన వర్షానికి సైతం మండలంలోని కొన్ని గ్రామాలలో పంటపొలాలు నీటమునిగా సంఘజీపేట చెరువు భారీగా మత్తడి దూకుతుంది గ్రామాల్లో పాత ఇల్లు సైతం నీలమట్టమయ్యాయి

తాజావార్తలు