భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలి.

తక్షణ సహాయక చర్యలు చేపట్టాలి.
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల.
వికారాబాద్ జులై  (జనంసాక్షి)జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు అందరు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశించారు.శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి ఇంజనీరింగ్, పంచాయతీ రాజ్, మున్సిపల్, ఎలక్ట్రిసిటీ, తహసీల్దార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నందున అధికారులు అందరు అప్రమత్తంగా ఉండి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలన్నారు.  ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రమాదకర స్థాయిలో ఉన్న చెరువులు, ట్యాంకుల వద్ద సిమెంట్, ఇసుక బస్తాలతో సిబ్బందిని 24 గంటలు అప్రమత్తంగా ఉంచాలని ఆదేశించారు.  జిల్లాలో గుర్తించిన 52 ప్రమాదకరంగా నీటిలో మునిగిపోయిన రహదారుల వద్ద పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖల అధికారులు తమ సిబ్బందిని నియమించి ప్రజలు రాకుండా దారులను బ్లాక్ చేయాలని ఆదేశించారు.  అన్ని గ్రామ పంచాయతీలలో పంచాయతీ రాజ్, రెవిన్యూ, పోలీస్ సిబ్బందితో ఏర్పాటు చేసిన కమిటీలను అప్రమత్తం చేసి ప్రజలు వర్షాలలో ఇండ్ల నుండి బయటకు రాకుండా, అందరు ఇండ్లలోనే ఉండేలా అప్రమత్తం చేయాలన్నారు.  గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీలలో శితిలావస్థలో ఉన్న గృహల నుండి ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు మున్సిపల్ కమీషనర్లు, పంచాయతీ రాజ్ అధికారులు,  తహసీల్దార్లు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.  ఎంపీడీఓలు, ఎంపీవోలు తమ సిబ్బందితో అన్ని గ్రామాలలో ఎప్పటికప్పుడు పారిశుధ్యం పనులను చేపట్టి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలన్నారు.  రోడ్లపై, గుంతలలో వర్షం నీరు నిలువకుండ చర్యలు చేపట్టాలన్నారు.  దోమలు ప్రబలకుండా ఫాగింగ్ చేయాలని ఆదేశించారు.  కలెక్టర్ కార్యాలయం లో 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని అత్యవసర సహాయం కొసం 7995061192 నెంబర్ కు కాల్ చేయాలని కలెక్టర్ సూచించారు.  ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని కోరారు.ఈ సందర్బంగా జిల్లా యస్ పి కోటిరెడ్డి మాట్లాడుతూ, ప్రతి ప్రమాదకర స్థలాల వద్ద పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి రహదారులను బ్లాక్ చేయడం జరిగిందన్నారు.  ప్రజలు కూడా అనవసరంగా బయటకు రాకుండా ఇండ్ల వద్దనే సురక్షితంగా ఉండాలని కోరారు.ఈ సమావేశంలో ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ ఇ ఇ లు, డీపీవో మల్లారెడ్డి, ఎంపీడీఓ లు, ఎంపీవోలు, మున్సిపల్ కమీషనర్లు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.