భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
తాండూరు జులై 9(జనంసాక్షి) వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుండి విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే
పైలట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు.రాత్రి వేళలో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు దయచేసి రాకుడదన్నారు.పొంగిపొర్లే వాగులను ఎట్టి పరిస్థితుల్లో దాటే ప్రయత్నం చేయొద్దన్నారు.
పాడుబడ్డ ఇళ్లల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.భారీ వర్షం కారణంగా ఇళ్లలోకి నీళ్లు వచ్చే అవకాశం ఉండడంతో తగు జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు.ముఖ్యంగా కరెంటు ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలను ముట్టుకోకుండా చిన్నపిల్లలను దూరంగా ఉంచాలన్నారు. జిల్లాలోని వివిధ గ్రామాలకు వెళ్లే రోడ్లు గాని,రహదారులు గాని,పొలాలకి వెళ్ళే బాటాలుగాని భారీ వర్షాల కారణంగా కొట్టుకోపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

జిల్లాలో ఎక్కడైనా రోడ్లు, వంతెనలు తెగిపోయి రాకపోకలు నిలిచిపోయి ప్రజలకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడితే డయల్ 100 కి ఫోన్ చేసి పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.