భార్య పై అనుమానం తో హత్య చేసిన వ్యక్తి ని రిమాండ్ కు తరలించిన పోలీసులు

జనం సాక్షి, చెన్న రావు పేట
మండలంలో ని అమీనాబాద్ గ్రామంలో భార్యను హత్య చేసిన ఆర్ఎంపీ డాక్టర్ జన్ను నరేష్ తన బార్య జన్ను అరుణపై అనుమానం పెంచుకున్నాడు, ఆ అనుమానంతో శుక్రవారం రోజున కటింగ్ ప్లైర్తో అరుణ తలపై బలంగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి మరణించినది,మృతురాలి తండ్రి కోడూరి కట్టయ్య పిర్యాదు మేరకు ముద్దాయి జన్ను నరేష్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ముద్దాయిని నర్సంపేట కోర్టులో ప్రవేశపెట్టి రిమాండుకి ఖమ్మం జైలుకి తరలించినట్టు సీఐ హతిరాం తెలిపారు. ఈ కార్యక్రమం లో చెన్నరావు పేట ఎస్ ఐ తోట మహేందర్ రెడ్డి తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.