భావోద్వేగంతో పార్టీని వీడిన వారంతా మళ్లీ రావాలి

ఎపికి కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే న్యాయం చేస్తుంది

విూడియా సమావేశంలో రఘువీరా

న్యూఢిల్లీ,జూలై13(జ‌నం సాక్షి): ఉమ్మడి ఆంధప్రదేశ్‌ విడిపోయిన సందర్భంలో భావోద్వేగంతో పార్టీని వీడిన వారినందరినీ తిరిగి కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నామని ఎపి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తెలిపారు.మాజీ సిఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ను వీడాక తమ ఆహ్వానం మేరకు తిరిగి పార్టీలోకి వచ్చారని రఘువీరా రెడ్డి తెలిపారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ భావోద్వేగంతో దూరమైన కాంగ్రెస్‌ నేతలంతా తిరిగి పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రధాని అయితేనే ఎపికి న్యాయం జరుగుతుందని రఘువీరా పేర్కొన్నారు. కిరణ్‌ను కాంగ్రెస్‌లోకి సాదరంగా ఆహ్వానించామన్నారు. కిరణ్‌ను కాంగ్రెస్‌లోకి సాధరంగా ఆహ్వానిస్తున్నామని అన్నారు. రాష్ట్రవిభజన జరిగిన భావోద్వేగంతో ఆయన పార్టీ నుంచి వెళ్లిపోయారని అన్నారు. భావోద్వేగాలతో కాంగ్రెస్‌కు దూరమైనవాళ్లంతా మళ్లీ పార్టీలోకి రావాలని రఘువీరా ఆహ్వానించారు.శుక్రవారం రాహుల్‌ సమక్షంలో ఉమ్మడి ఆంధప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారని అన్నారు. ఇకపోతే కాంగ్రెస్‌ పూర్వ వైభవం సాధించేలా ఆంధ్రప్రదేశ్‌లో స్పెషల్‌ యాక్షన్‌ ప్లాను అయలు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నామని, 55 నియోజకవర్గాల్లో ప్రత్యేక రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. ఏపీని కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే ఆదుకోగలదని, రాహుల్‌ గాంధీ ప్రధాని అయితేనే ఏపీకి న్యాయం జరుగుతుందని, విభజన చట్టంలో ఉన్న హావిూలన్నీ అమలవుతాయని రఘువీరారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలావుంటే కాంగ్రెస్‌ పార్టీతో తన బంధం విడదీయలేనిదని

మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘మా కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీతోనే గుర్తింపు వచ్చింది. నా తండ్రి నాలుగుసార్లు, నేను నాలుగుసార్లు శాసనసభ్యుడిగా గెలిచామంటే అది కాంగ్రెస్‌ పార్టీ వల్లే. గాంధీ కుటుంబంతో సన్నిహితంగా మెలగడం వల్లనే నేను చీఫ్‌ విప్‌, స్పీకర్‌, ముఖ్యమంత్రి వంటి పదవులు అనుభవించగలిగాను. నేను వైఎస్‌కు అత్యంత సన్నిహితుడిని. కాంగ్రెస్‌ పార్టీలోకి తిరిగి రావడం సంతోషంగా ఉంది. కాంగ్రెస్‌ పార్టీ ఏ బాధ్యత అప్పగించినా సమర్థంగా నిర్వహిస్తా. కాంగ్రెస్‌ వీడిన 30-40 మంది నేతలను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం’ ‘వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తేనే విభజన హావిూలు నెరవేరతాయి. ఏపీకి ప్రత్యేక¬దా కాంగ్రెస్‌ పార్టీ వల్లే సాధ్యం. పార్లమెంటులో నాటి ప్రధాని ఇచ్చిన హావిూలను ఎన్డీయే ప్రభుత్వం అపహాస్యం చేసింది. విభజన చట్టం అమల్లో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. విభజన చట్టం అమల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు విఫలమయ్యాయి. విభజన చట్టాన్ని రూపొందించిన కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే దాన్ని అమలు చేసేందుకు సిద్దంగా ఉంది’ అని కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.