భూగర్భ జలాలను కాపాడుకోవాలి

ఆటోస్టార్టర్ల తొలగింపుపై నేతల పిలుపు

సిద్దిపేట,డిసెంబర్‌18(జ‌నంసాక్షి): ఉద్యమంలో ముందు వరుసలో ఉన్న సిద్దిపేట ఆటోమేటిక్‌ స్టార్టర్ల తొలగింపులోనూ ఆదర్శంగా ఉండాలని టిఆర్‌ఎస్‌ శ్రేణులు సూచించారు. ఉచిత నిరంతర విద్యుత్‌ అందించి రెండేళ్లు కావస్తున్న సందర్బంగా వీటిని కూడా తొలగించాల్సి ఉందన్నారు. రైతుల సంక్షేమానికి సబ్సిడీపై ముందస్తుగా విత్తనాలు, ఎరువులు పంపిణీ చేస్తున్నామన్నారు. దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న రైతుల భూసమస్యలు పరిష్కరించేందుకు భూరికార్డుల ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. సబ్సిడీపై స్పిం/-రక్లర్లు, డ్రిప్‌, పాలీహౌస్‌ల నిర్మాణానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టిందన్నారు. మంత్రి హరీష్‌ రావు ఆదేశాలతో గ్రామాల్లో ఆటోమేటిక్‌ స్టార్లర్ల తొలగింపుపై ప్రచారం చేస్తున్నారు. రైతులను పలకరిస్తూ 24 కరెంట్‌పై ప్రచారం చేస్తున్నారు. గతంలో వచ్చిపోయే కరెంట్‌ కోసం రైతులంతా ఆటోమేటిక్‌ స్టార్టర్లు కొనుక్కున్నారు.. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ రైతాంగానికి ఉచితంగా 24 గంటల కరెంట్‌ను ఇస్తున్నారు. గత ఆరు మాసాలుగా ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఇస్తున్నారు.ఇప్పుడు నాణ్యమైన కరెంట్‌ వస్తున్నందన ఇక ఆటోమేటిక్‌ స్టార్టర్లను తొలగిద్దాం. భూగర్భ జలాలు కాపాడుకుందాం అన్‌ంన నినాదాలతో సాగుతున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పత్తి మార్కెట్‌ యార్డులో జిల్లాలోని రైతు సమన్వయ సమితి సభ్యులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, రైతులు, మహిళలతో ఆటోమేటిక్‌ స్టార్టర్ల తొలగింపుపై ఇటీవల అవగాహన సదస్సు నిర్వహించారు. దీంతో రైతులకు కావాల్సినంత కరెంట్‌ ఇస్తున్నందున ఇక స్టార్టర్లను కూడా తొలగించి సహకరించాలన్నారు. ఆటోమేటిక్‌ స్టార్టర్ల వాడకం వల్ల అవసరానికి మించి నీటిని తోడేస్తూ భూగర్భజలాలుఅ డుగంటడమే గాకుండా కరెంట్‌ వృధా కానుందని పలువురు హెచ్చరించారు. రాష్ట్రం ఏర్పడక ముందు లోవోల్టేజీ సమస్యతో కరెంట్‌ మోటర్లు, స్టార్టర్లు కాలిపోయేవన్నారు. రైతులందరి మేలు కోసం ఆటోమేటిక్‌ స్టార్టర్లు తొలగించే కార్యక్రమానికి అందరం సమష్టిగా కృషి చేద్దామన్నారు. ఇందుకోసం సబ్‌స్టేషన్‌, ట్రాన్స్‌ఫార్మర్‌ పరిధిలోని రైతులతో కమిటీలు వేసి ఆటోమేటిక్‌ స్టార్టర్లను తొలగిద్దామని రైతులకు సూచించారు. నీటిని పొదుపుగా వాడుకొని పంటలు పరిరక్షించుకుందామన్నారు. ప్రభుత్వం వచ్చే వానకాలం నుంచి రైతులకు ఎకరాకు రూ.8వేల పెట్టుబడి ఇస్తున్నదని, రైతులు తమ ధాన్యానికి మద్దతు ధరకు అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.