భూదందాపై సిపిఎం ఆందోళన

నిజామాబాద్‌,మే3(జ‌నం సాక్షి):  నిజామాబాద్‌ నగరానికి చెందిన ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఎంఏ ఆఫీస్‌ సర్ఫరాజ్‌ ప్రభుత్వ స్థలాలను  అసైన్డ్‌ ,అటవీ వాక్ఫ్‌ బోర్డ్‌,దేవాదాయ, దర్గా, బొందలగడ్డ స్థలాలను కబ్జా చేసి ఎ/-లాట్లుగా మార్చి అక్రమ రిజిస్టేష్రన్లు చేయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని సిపిఎం నేతలు ఆరోపించారు.   సర్ఫరాజ్‌ భూదందాపై విచారణ చేయించి, అతని రిజస్టేష్రన్‌ భూములను  బ్లాక్‌ లిస్టులో పెట్టాలని గురువారం సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ ఎం రామ్మోహన్‌ రావుకు ఫిర్యాదు చేశారు..ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి మల్యాల గోవర్ధన్‌ మాట్లాడుతూ అనేక సర్వే నెంబర్లలో కబ్జాలకు పాల్పడ్డారన్నారు. అతడి వ్యవహారాలను బ్లాక్‌ లిస్టులో పెట్టాలని భూదందాపై విచారణ చేపట్టాలని కోరారు.
—————-