భూధాన్ భూముల వివాదంపై కేసు నమోదు
మేళ్లచెరువు మండలం( జనం సాక్షి న్యూస్)
మండల పరిధిలోని భూధాన్ భూముల వివాదంపై పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సురేష్ యాదవ్ తెలిపారు.
ఈరోజు అనగా తేదీ:26-09-2022న మేళ్లచెరువు పోలీస్ స్టేషన్ పరిధిలోని భూదాన్ భూముల వివాదం పై కీర్తి సిమెంట్, మైహోమ్స్ యాజమాన్యాలు సహా 5మంది ప్రభుత్వ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. నిందితులపై ఐపిసి సెక్షన్ 120(బి),420,379, 417,418,468,504,506,191, 201,r/w 34,sec 3 of PDPP ACT కింద కేసు నమోదు చేయడం జరిగింది.కోర్టు ఆదేశాల మేరకు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాము.A1. జాస్తి త్రివేణి,
A2. జాస్తి శేషగిరిరావు,
A3. జె.శ్రీనివాస్,
A4. మునగాల రామ్మోహన్ రావు, A5. ఎన్.శ్రీనివాసరావు,
A6. కె.నాగేశ్వరావు, A7.మేళ్లచెరువు తాసిల్దార్ కొల్లుదామోదర్,
A8.మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్, A9.మేళ్లచెరువు గ్రామపంచాయతీ కార్యదర్శి ఈర్ల నారాయణరెడ్డి, A10.ఇరిగేషన్ ఈఈ కె.శ్రీనివాస్, A11.విద్యుత్ శాఖ మేళ్లచెరువు ఏఈలను ఎఫ్ ఆర్ లో చేర్చి విచారిస్తున్నాం.ఎఫ్ఐఆర్ నెం: 149/2022 గా కేసు నమోదు చేసి, కేసు పత్రాలు కోర్టుకు సమర్పించడం జరిగింది. దర్యాప్తు అనంతరం మిగితా విషయాలు తెలుబడును. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.