భూపతిపూర్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు
భూపతిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముందస్తుగా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రకరకాల పూలతో బతుకమ్మని అలంకరించారు. అనంతరం విద్యార్తినిలు కొలాటాలతో, బతుకమ్మ ఆట పాటలతో నృత్యాలు చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కామని లక్ష్మయ్య, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ జక్కుల రాజేంద్రప్రసాద్, ఉపాధ్యాయురాలు తిరుమల, ఉపాధ్యాయులు రామస్వామి, మహేష్, గిరిధర్, శంకరయ్య, కార్తిక్, గంగరాజం, గంగాధర్, శ్రీను మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.