భూపరిపాలనాధికారి ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో మృతి
ఆదిలాబాద్: రాష్ట్ర భూ పరిపాలనశాఖ ప్రత్యేక కార్యదర్శి ఎన్.గోపీ ఈ రోజు హఠన్మరణం చెందారు. జిల్లాలోని కుంటాల జలపాతం సందర్శించేందుకు ఆయన సిబ్బందితో కలిసి శనివారం సాయంత్రం ఆదిలాబాద్‌కు చేరుకున్నారు. డీఆర్‌డీఏ విశ్రాంతి గృహంలో బస చేసిన ఆయన ఈ రోజు ఉదయం రక్తవాంతులు చేసుకోవటంతో సిబ్బంది రిమ్స్‌కు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించటంతో వైద్యులు ఆయనను కాపాడలేకపోయారు. గోపి ఋత దేహాన్ని హైదరాబాద్ తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.