భూపాలపల్లి జిల్లాని విపత్తు జిల్లాగా ప్రకటించాలి.
గోదావరి ముంపు గ్రామాల ప్రజలకు అండగా ఉంటాం.
వైయస్సార్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్..
మహాదేవపూర్ (కాళేశ్వరం ) జులై 18 జనంసాక్షి న్యూస్ :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో గోదావరి ముప్పు గ్రామాలు దమెరకుంట, విలసగర్, లక్ష్మీపురం రైతులను కలసి మనోదైర్యాని ఇచ్చిన వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు అప్పం కిషన్ అన్నారు. ముంపు ప్రాంతాల రైతులకు వారికి జరిగిన నష్టంపై అధికారులు పూర్తిస్థాయి నష్టని అంచనా వేయాలని ప్రభుత్వానికి ప్రత్యేక నివేదికను పంపాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాను విపత్తు జిల్లాగా ప్రకటించాలని నిన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించిన కుటుంబానికి 10 వేయిల రూపాయల పరిహారాన్ని పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని వైయస్సార్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాలేశ్వరంలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చేందుకు క్లౌడ్ బరస్ట్ అన్నారని అసలు క్లౌడ్ బరస్ట్ అంటే కల్వకుంట్ల రాజ్యాధికారాన్ని ప్రకృతి గోదావరిలో కలిపేసిందని ప్రజలు అనుకుంటున్నారని ఏద్దేవాచేశారు.కెసిఆర్ కు ప్రతిపక్షాల నుండి సమస్య మొదలవుతుందని అన్ని రాజకీయ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని నాకెవరు ఎదురులేరు అని అహంకారిగా విర్రవీగుతున్న కెసిఆర్ కు పంచభూతలు నీటి రూపంలో కేసీఆర్ పై దండయాత్ర చేయడం జరుగుతుందని త్వరలో ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు. ఓటు రూపంలో తెలంగాణ ప్రజలు బుద్ది చెప్తారని అన్నారు.అనంతరం కాలేశ్వరంలోని గోదావరి వరద ఉధృతిని అప్పం కిషన్ పరిశీలించారు. రాబోయే వర్షాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులు ముప్పు గ్రామాలకి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాము,శంకర్,సుధాకర్ సుధాకర్ పర్వతాలు రాజబాబు, శ్రీనివాస్ సుమన్, పీక కిరణ్ తదితరులు పాల్గొన్నారు..