భూమికి చేరుకోనున్న సునీతా విలియమ్స్
హూస్టన్: గత నాలుగు మాసాలుగా అంతరిక్షంలో గడిపిన భారత్-అమెరికా సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ మరో ఇద్దరు వ్యోమగాములతో పాటుగా ఆదివారం భూమికి చేరుకోనున్నారు. శనివారం భూమికి తిరుగు ముఖం పట్టిన సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం బాధ్యతలను తోటి నాసా వ్యోమగామి కెవిన్ ఫోర్ట్‌కు లాంచనంగా అప్పగించారు. జపాన్ అంతరిక్ష శోధన ఏజెన్సీ చెందిన అకి హోషిడె,రష్యా సూయిజ్ కమాండర్ యూరీ మలెంచెకోలతో పాటుగా విలియమ్స్ ఆదివారం భూమికి తిరిగి వస్తున్నారు. జులై మధ్య కాలంలో ఎక్స్ పెడిషన్ కమాండర్ 33గా బాధ్యతలు చేపట్టిన సునీతా విలియమ్స్..అకి హోషిడె,యూరీ మలెంచెకోలతో పాటుగా అప్పటి నుంచి అంతరిక్ష కేంత్రంలో ఉంటున్నారు.ఎక్స్‌పెడిషిన్ 34కు నాంది పలుకుతున్నట్టుగా బాధ్యతలను ఆమె కెవిన్ ఫోర్ట్‌కు అప్పగించారు. ”చక్కగా పనిచేస్తున్న అంతరిక్ష నౌకను మేం వీడుతున్నాం.మేం భూమికి తిరిగి వెళుతున్న తరుణంలో కెవిన్‌కు బాధ్యతలను అప్పగించటం నాకెంతో గౌరవాన్ని ఇచ్చింది.నౌకను తిరిగి శుభ హస్తాలకు అప్పగిస్తున్నాం” అని బాధ్యతలను అప్పగించిన అనంతరం విలియమ్ తెలిపారు. అక్టోబర్ 25న అంతరిక్ష కేంద్రానికి ఎక్స్‌పెడిషన్ 33ఫ్లైట్ ఇంజనీర్‌గా చేరుకున్న ఫోర్ట్ ఎక్స్‌పెడిషన్ 34కమాండర్‌గా అవతరించారు.సూయిజ్ టిఎంఎ-05ఎం విలియమమ్స్, అకిహోడె,యూరీ మలెంచెకోలతో సాయంత్రం 5.26 గంటలకు (ఈఎస్‌టీ ప్రకారం) అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరుతుంది.పలు గంటల అనంతరం కజకస్థాన్ చేరుకుంటుంది. గత సంవత్సరం జులై 15న అంతరిక్ష యాత్ర ప్రారంభమైంది.అంతరిక్ష కేంంలో 125 రోజులు గడిపారు.127 రోజుల తర్వాత భూమికి ముగ్గురు వ్యోమగాముల తిరుగు ప్రయాణంతో అంతరిక్షంలో వారి యాత్ర ముగిసినట్టయింది.