*భూములు పట్టాలు కాని వారికి ప్రభుత్వం వెంటనే పట్టాలుచేయాలి.

*ఏవైఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లయ్య.
చిట్యాల 11(జనంసాక్షి)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సాద బైనామ లో, ధరణి పోర్టర్ లో లలో భూములు పట్టాల కోసం ధరఖాస్తు చేసుకున్న వారందరికీ కాకుండా కొంత మందికి భూములు పట్టాలు చేశారని, పట్టాలు కాని వారికి సైట్ ఓపెన్ చేసి భూములు పట్టాలు చేయాలని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల మల్లయ్య అన్నారు.
మంగళవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం సాద బైనామ నెల రోజుల తర్వాత సైట్ బంద్ చేసి ధరణి పోర్టర్ ఓపెన్ చేసి నెల రోజుల తర్వాత సైట్ బంద్ చేసి కొంత మందికి భూములు పట్టాలు చేసీ, మిగతా వారికి అన్యాయం చేస్తుందని, కొంత మంది సాద బైనామ ధరణి లలో ఇతరుల భూములు పట్టాలు చేసుకున్న వాటిని తొలగించాలని సంబంధించిన అధికారులకు తెలుపగా కోర్టుకు వెళ్లాలని దానికి మేము ఏమి చేయలేమని అంటున్నారని ఆయన చెప్పారు. సైట్ మీద గుంట భూమి లేకున్నా అక్రమంగా భూములు పట్టాలు చేసుకున్న వాటిపై విచారణ జరిపించాలని ఇలాంటి సంఘటనలు అనేక సమస్యలు ఉన్నాయని, అందుకు సైట్ ఓపెన్ చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. ప్రభుత్వం స్పందించి అక్రమంగా పట్టాలు చేసుకున్న వాటిని తొలగించాలని, అక్రమంగా భూమి మీద రైతు బంధు డబ్బులు అన్యాయంగా తీసుకుంటున్నారని ఆయన అన్నారు. సాద బైనామ లో మరియు ధరణి పోర్టర్ లో భూములు పట్టాల కొరకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ పట్టాలు చేస్తామని కొందరికి పట్టాలు చేశారని. . ఈ ప్రభుత్వం వందల ఎకరాల భూములు ఉన్న వారికి, ఆర్థికంగా డబ్బులు ఉన్న వారికి పట్టాలు చేసి పేదలకు అన్యాయం చేయడమమేన అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే సాద బైనామ లో, ధరణి లలో దరఖాస్తులు చేసుకున్నా వారందరికీ సైట్ ఓపెన్ చేసి భూములు పట్టాలు చేయాలని. లేని పక్షంలో లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్, నాయకులు పుల్ల సమ్మయ్య, పుల్ల సదానందం తదితరులు పాల్గొన్నారు.