భూ వివాదాల పరిష్కారంలో నిర్లక్ష్యం

రైతులు ఆందోళన చేస్తున్న పట్టించుకోని వైనం
మంచిర్యాల,జూలై 23(జ‌నంసాక్షి): భూసమస్యలు కుప్పలుతెప్పలుగా వెలుగు చూస్తున్నాయి. భూప్రక్షాళన చేపట్టినా 20 శాతం దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. మ్యూటేషన్‌ల లోనూ ఫోర్జరీ, ఒకరి భూమి మరొకరి పేరిట, ఒకే భూమి ఇద్దరు, ముగ్గురి పేరిట పట్టాలాంటి ఆరోపణలు ఉన్నాయి. వివాదాలు పరిష్కారం కాని కారణంగా పలువురికి రైతుబంధు పథకం అందడంలేదు. భూమి సమస్య పరిష్కారం కాకపోవడంతో రైతు లు సహనం కోల్పోతున్నారు. మండల కేంద్రాల్లో పరి ష్కారం కాకపోవడంతో జిల్లా కేంద్రాలకు వస్తున్నారు. నిరసలు, ఆందోళనలు, ఆత్మహత్యాయత్నాలకు పాల్ప డుతున్నారు. ఇటీవల  కలెక్టరేట్‌ వద్ద పదుల సంఖ్యలో రైతులు పురుగుల మందు, కిరోసిన్‌ వెంట తెచ్చుకోవడం, ప్లెక్సీలు పట్టుకొని ధర్నాలు చేయడం సమస్య తీవ్రతను తెలియ చేసింది. కొందరు రైతులు ప్రతీవారం ప్రజావాణికి వచ్చి దరఖాస్తు చేసుకున్నా సమస్య పరిష్కారం కావడంలేదు. కొన్నిచోట్ల రెవెన్యూ అధికారి సంతకం ఫోర్జరీ చేసి ప్రొసీడింగ్‌ జారీ చేసి మార్పులు, చేర్పులు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజలు వారి భూ రికార్డుల కోసం సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకోగా అందుబాటులో లేవనే సమాధానం ఇస్తున్నారు. కొన్నిచోట్ల ఆర్‌వోఆర్‌కు సంబంధించిన ఫైల్స్‌ మిస్సింగ్‌కు బాధ్యులుగా చేస్తూ చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు నిర్ణయించినా ఎవరి పై చర్యలు తీసుకోలేదు. జిల్లాలోని 18 మండలాల్లో నూ ఆన్‌లైన్‌ పట్టాలలో, పహాణీలలో విచ్చలవిడిగా మార్పులు చేయడం, పలువురి భూములను కబ్జాలు చేయడం, ఒకరి పేరిట ఉన్న భూమిని మరొకరు మార్చుకోవడం, రాజకీయ అండదండలతో ప్రభుత్వ
భూములను కబ్జా చేయడం షరామామూలుగా మారింది. ప్రభుత్వం రైతుబంధు ద్వారా సాగుకు సాయం అందిస్తుండడంతో భూమి ఆక్రమణల వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. రైతులు తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చి జరిగిన అన్యాయాన్ని, అధికారులు చేసిన తప్పిదాలను ఎత్తిచూపుతున్నారు.
ఇప్పటికైనా ఉన్న తాధికారులు భూ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

తాజావార్తలు