భృణ హత్యలను నివారించాలి
కొనకనమిట్ల , జూలై 26 : సృష్టికి మూలం ఆడదేనని అలాంటి ఆడపిల్లలను గర్బంలోనే చిదిమివేయడం అమానుషం అని అలాంటి భృణ హత్యలను నివారించాలంటూ జననీ శిశు సురక్ష ఆధ్వర్యంలో జిల్లా మాస్ మీడియా లక్ష్మీబృందం సభ్యులచే బుర్రకథ ద్వారా కళాజాత గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మండల కేంద్రమైన కొనకనమిట్ల బస్టాండ్ సెంటర్‌లో మండలంలోని గొట్లగట్టు బస్టాండ్ సెంటర్‌లలో నిర్వహించారు. తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ జాతాలో వారు వినిపించారు. ఈ సందర్భంగా మాస్ మీడియా అధికారి జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ కళాజాత బృందం సభ్యులు జిల్లా వ్యాప్తంగా పర్యటించి శిశు సురక్షపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్యంపై అవగాహన కల్పించేలా పలు గేయాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఇవి రత్నమ్మ, హెల్త్ సూపర్‌వైజర్లు ఎన్ శ్రీనివాసులరెడ్డి, శ్రీనివాసరావు, హెల్త్ అసిస్టెంట్ నరసారెడ్డి, ఎఎన్‌ఎంలు ఉమాకాశ్చాయిని, సుజాత తదితరులు పాల్గొన్నారు.