భోజన కార్మికులకు అన్యాయం చేయొద్దు

విశాఖపట్టణం,జూన్‌19(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రయివేటు సంస్థలకుఅప్పగిస్తే సహించేది లేదని భోజన కార్మికుల సంఘం జిల్లా నాయకులు హెచ్చరించారు. పెంచిన చెట్టును తానే సమూలంగా పెకిలించే విధంగా సిఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.పథక నిర్వహణకు వంటపాత్రలతో పాటు ఇతరత్రా కనీస మౌలిక వసతులు లేకపోవడంతో పాటు బిల్లులు, వేతనాలను నెలల తరబడి చెల్లించకపోయినా విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారన్నారు. ఇదే పథకాన్ని నమ్ముకుని వేల మందికి పైగా జిల్లాల్లో ఉన్నారని, వారంతా జీవనోపాధి కోల్పోయే పరిస్థితి తప్పదన్నారు. తమిళనాడులో ఒక్కొక్కరి రూ.5500 జీతం చెల్లిస్తున్నారని, తమకు కూడా 1000 వేతనం ఇస్తున్నా చిన్నారులకు సేవ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం తక్షనం తన నిర్ణయం వెనక్కి తీసుకోవాలన్నారు.