మంచినీటి వసతికి నిధులు మంజూరు
కడప, జూలై 10 : రైల్వేకోడూరు నియోజకవర్గంలో తాగునీటి వసతి కోసం ప్రభుత్వం కోటి రూపాయలు నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్సీ చంగల్రాయుడు ఒక ప్రకటనలో చెప్పారు. మండలానికి 20 లక్షల చొప్పున మంచినీటి వసతి కోసం ఖర్చు చేస్తామని అన్నారు. అలాగే ప్రభుత్వం పల్లంపేట మండలానికి మంచినీటి వసతి కోసం 10 కోట్ల నాబార్డ్ నిధులు మంజూరు చేసిందని అన్నారు. అలాగే చిట్వేలు మండలానికి 2 కోట్లు మంజూరు చేసిందని అన్నారు. ఈ నిధులతో మంచినీటి సమస్య ఉన్న ప్రాంతాలలో ప్రాధానత్య ప్రకారం ఖర్చు చేస్తామని చెప్పారు.