మండలంలోని ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పిస్తాను

వలిగొండ జనం సాక్షి న్యూస్ జూలై 19 మండలలోని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్నానని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. వలిగొండ మండలంలోని గోకారం, జాలుకాలువ,నెమలికాల్వ గ్రామాలలో ఎం జి ఎన్ ఆర్.ఈ.జి.ఎస్  నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను మంగళవారం ప్రారంభించారు. 25 లక్షల రూపాయలతో ప్రత్యేక అభివృద్ధి నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్లు,అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా గోకారం గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు వేదికను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని గ్రామాలలో సిసి రోడ్లను పూర్తి చేయడం జరుగుతుందన్నారు. సమగ్ర అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నానని, ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో నియోజకవర్గంలో పార్టీలకతీతంగా అన్ని గ్రామాలకు సమాన ప్రాతిపదికన నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు.అనంతరం  మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మీ, షాదీముభారక్ 48 చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.ఈకార్యక్రమంలో ఎంపిపి నూతి రమేష్ రాజ్,జెడ్పీటీసీ వాకిటి పద్మ,వైస్ ఎంపిపి బాతరాజు ఉమా బాలనరసింహ,రాష్ట్ర నాయకులు వంగాల వెంకన్న,మార్కెట్ కమిటీ చైర్మన్ కునపూరి కవిత, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ పనుమటి మమత నరేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మల వెంకట్ రెడ్డి సింగిల్ విండో చైర్మన్ సురకంటి వెంకటరెడ్డి,ఎయంసి డైరెక్టర్ ఎలిమినేటి సత్యనారాయణ, పట్టణపు అధ్యక్షులు లింగస్వామిమహిళ విభాగం మండల అధ్యక్షురాలు మద్దెల మంజుల,సర్పంచ్ లు తుర్కపల్లి మాధవి సురేందర్,మద్దెల సందీప్ గౌడ్,వంగాల బిక్షపతి, అధికారులు ఎంపీడీవో లెంకల గీతారెడ్డి ఎంపీ ఓ కేదారేశ్వర్ పి ఆర్ ఏ ఈ సుగుణాకర్ రావు ఎస్సై ప్రభాకర్ మాదా శంకర్ గౌడ్ వివిధ గ్రామాల సర్పంచ్ లు,ఎంపిటిసి లు, పల్సం రమేష్ నోముల మల్లేష్ ప్రజా ప్రతినిధులు, ,పార్టీ నాయకులు కార్యకర్తలుతదితరులు పాల్గొన్నారు.
2 Attachments

తాజావార్తలు