మండలంలో అద్వాన్నంగా రోడ్లు…..
*గుంతల రోడ్లతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు……
*ప్రమాదాలు జరిగి ఆర్ధికంగా,ఆరోగ్య పరంగా నష్టపోతున్న ప్రయాణికులు…..
*పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులు……
*తెలంగాణ జనసమితి మండల అధ్యక్షులు అంబాల రమేష్…..
టేకుమట్ల.సెప్టెంబర్03(జనంసాక్షి) మండలంలో ఆర్ అండ్ బి రోడ్లు అద్వాన్నంగా ఉన్నాయని,గుంతల రోడ్లతోప్రయాణికులు,వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారని తెలంగాణ జనసమితి మండల అధ్యక్షులు అంబాల రమేష్ అన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మండలంలో సుబ్బక్కపల్లి నుండి టేకుమట్ల వరకు,ఆరెపల్లి నుండి వెల్లంపల్లి వరకు, రామకిష్టాపూర్(వి)నుండి వెంకట్రావుపల్లి,వరకు ఉన్న రోడ్లు మరి అద్వాన్నంగా ఉన్నాయని సుమారు 10 గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు వాహనదారులు ఆ రోడ్లపై అనేక వ్యయ ప్రయాసాల కొర్చి ప్రయాణం చేస్తున్నారని.రహదారులు మొత్తం గుంతలమయం అయ్యాయని,చిన్న వర్షానికే ఆ గుంతల్లో వర్షపునీరు నిలిచి రోడ్ ఎక్కడ ఉందో గుంత ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి దాపురించిందని అన్నారు.ఆ గుంతల్లో వాహనదారులు అదుపుతప్పి కిందపడిపోయి గాయాలపాలై ఆర్థికంగా,ఆరోగ్య పరంగా ఇబ్బందులు పడిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.కనీసం ఆర్ అండ్ బి అధికారులు, ప్రజాప్రతినిధులు ఐనా ఆ గుంతల్లో మొరం పోయించిన దాఖలాలు లేవని,ప్రయివేట్ వాహన యజమానులు రోడ్లపై వాహనాలు నడపడం మూలంగా వారి వాహనాలు తొందరగానే చెడిపోతున్నాయని వారి సంపాదన మొత్తం వాహనాలు బాగుచేసుకోవడానికే సరిపోతుందని అన్నారు.టేకుమట్ల -అంకుషాపూర్,సుబ్బక్కపల్లి -నవాబుపేటలో గల రెండు లోలెవల్ కల్వర్ట్ ల పైనుండి నిత్యం నీరు ప్రవహించడం మూలంగా నాచు పేరుకుపోయి ద్విచక్ర వాహనదారులు జారిపడుతున్నారని, ప్రజాప్రతినిధులు సైతంద్విచక్ర వాహనాలతో కిందపడిపోయిన సందర్భాలు ఉన్నాయని,ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి మండలంలో నూతన రోడ్లు మంజూరు చేసి ప్రజలు, ప్రయాణికుల, వాహనదారుల బాధలను తీర్చాలని ఆయన కోరారు.