మండలంలో కురిసిన భారీ వర్షాలకు రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
– సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బుర్రి శ్రీరాములు
మునగాల, అక్టోబర్ 01(జనంసాక్షి): మండలంలోని వివిధ గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బుర్రి శ్రీరాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం బట్టు నాగయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బుర్రి శ్రీరాములు మాట్లాడుతూ, మండలంలోని వివిధ గ్రామాల్లో విస్తారంగా కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి 25 వేల చొప్పున పంట నష్ట నష్టపరిహారం చెల్లించాలని, ప్రభుత్వం ఉన్నతాధికారులతో వెంటనే సర్వే చేయించి రైతులను ఆదుకోవాలని, వాగులు వరద ప్రవాహంతో వివిధ గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వాగులపైన ఎత్తయిన వంతెనలు నిర్మించాలని, ప్రజల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వర రావు, దేవరం వెంకటరెడ్డి, పార్టీ మండల కార్యదర్శి చందా చంద్రయ్య, పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం, ఎస్కే సైదా, వీరబోయిన వెంకన్న, విజయలక్ష్మి, జ్యోతి, వెంకట కోటమ్మ, స్టాలిన్ రెడ్డి, ఉపేందర్, గోపయ్య, వెంకటాద్రి, మంగయ్య, కృష్ణారెడ్డి, సతీష్, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.