మండలానికి 5 వేల సభ్వత్వాలు
విజయవాడ,ఫిబ్రవరి17 (జనంసాక్షి) : ప్రతి మండలంలోనూ 5 వేల మంది సభ్వత్య నమోదు లక్ష్యంగా బిజెపి సభ్యత్వ నమోదు పక్రియను నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు రామినేని వెంకటకృష్ణ వెల్లడించారు. గ్రామస్థాయిలో పార్టీ పటిష్ఠత, బలోపేతానికి కార్యకర్తల పెంపునకు సభ్యత్వ నమోదు వేదికగా మార్చాలని పేర్కొన్నారు. ఈనెల 22 నుంచి మండలంలోని 22 పంచాయతీల్లో పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభిస్తామని అన్నారు. పార్టీ నేతలు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి పోలింగ్‌బూత్ పరిధిలో వందమంది కొత్త సభ్యుల నమోదుచేయడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. ఇలా చేర్చిన కార్యకర్తకే క్రియాశీలక సభ్యత్వం అందజేస్తామని స్పష్టంచేశారు.