మండల అధ్యక్షుడి గా నాగేశ్వరరావు నాయక్

మేళ్లచెరువు

టీఆర్ ఎస్ కెవి అనుబంధ ఆటో యూనియన్ మండల అధ్యక్షుడిగా మండల పరిధిలోని హేమ్లాతండా గ్రామపంచాయితి కి చెందిన బానోతు నాగేశ్వరరావు నాయక్ ను నియమిస్తూ టిఆర్ ఎస్ కేవీ నియోజకవర్గ అధ్యక్షుడు పచ్చిపాల ఉపేందర్ నియామక పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో యూనియన్ ను ఏర్పాటు చేసుకోవడం శుభ పరిణామన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో స్థానిక ఎమ్మెల్యే శానంపుడి సైది రెడ్డి సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రతి ఒక్క కార్మికుడు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి టిఆర్ ఎస్ కేవీ మండల అధ్యక్షుడు సాముల వెంకట రెడ్డి అధ్యక్షత వహించగా మండల ఉపాధ్యక్షుడిగా సైదా, కోశాధికారిగా బాలు, కార్యదర్శిగా నాగరాజు, సహాయ కార్యదర్శి గా జానీ ని ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో
మండల టిఆర్ ఎస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఎల్. నాగేశ్వరరావు నాయక్,ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.