మండల కేంద్రంలో 17వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు.
బూర్గంపహాడ్ సెప్టెంబరు 04 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలంలోని గోదావరి వరద బాధిత గ్రామాలను పోలవరం ముంపు గ్రామాలుగా గుర్తించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించాలని లేదా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని కొనసాగుతున్న నిరవధిక రిలే నిరాహార దీక్షలు నేటికీ 17వ రోజుకు చేరుకున్నాయి. ఆదివారం కొనసాగిన దీక్షలో మాజీ ఎమ్మెల్యే కుంజా బిక్షం సతీమణి మహిళా కన్వీనర్ వెంకటరమణ, ఎస్.కె గౌస్య బేగం, ఎస్కే రహీమున్నీసా, మహాదేవ గోవిందమ్మ, మహిసాక్షి రామ సీత, పొదిల పుల్లయ్య, తోకల లక్ష్మయ్య, భూపల్లి నరసింహారావు, ఎస్.కె హైమద్, ఫ్రెండ్స్ ఫౌండేషన్ అధినేత నాగరాజు, పేరాల నారాయణమ్మ, శ్యాంకూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.