మండల కేంద్రానికి బతుకమ్మ చీరలు
పేదింటి ఆడబిడ్డకు పుట్టింటి కానుకగా ప్రభుత్వ బతుకమ్మ చీర:తహసిల్దార్ చందా నరేష్
కొత్తగూడ సెప్టెంబర్ 21 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రానికి చేరుకున్న బతుకమ్మ చీరలు…ప్రభుత్వం ఎంతో ప్రతిష్మాత్మకంగా పేదింటి ఆడబిడ్డకు పుట్టింటి కానుకగా ఇస్తున్న చీరలను స్థానిక తహసిల్దార్ చందా నరేష్ దగ్గరుండి దిగుమతి చేసుకోవడం జరిగింది.అనంతరం మాట్లాడుతూ ఈనెల 25న ప్రారంభం కానున్న బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మండలానికి 10,805 చీరలు పంపించడం జరిగిందని తెలిపారు.పంపిణీకి రంగం సిద్ధం చేయడం జరుగుతుందని అన్నారు.