మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.
1 అక్టోబర్ (జనం సాక్షి):దమ్మపేట మండల కేంద్రంలోనీ మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుప్రక్కల గ్రామాలలోని మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు అధికారులు సమక్షంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం దమ్మపేట వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు జన్మదిన వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎంపీపీ సోయం ప్రసాద్, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, ఎంపీడీవో చంద్రశేఖర్, మందలపల్లి సర్పంచ్ దుర్గా, సెక్రెటరిలు వార్డు మెంబర్లు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు