మంత్రిపర్యా… హామీలు మరిచారా?
దళిత సంఘాల జేఏసీ నేతలు
సుభాష్‌నగర్, న్యూస్‌లైన్: నాలుగేళ్లుగా ఏటా అంబేద్కర్, బాబుజగ్జీవన్‌రాం జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి, కలెక్టర్ ఇచ్చిన హామీలు మరిచిపోయారని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, దళిత సంఘాల నాయకుడు కంసాల శ్రీనివాస్, ముల్కల గంగారాం అన్నారు. నగరంలో శుక్రవారం
విలేకరులతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ను అంబేద్కర్ ప్రాంగణంగా , ప్రధాన ఆస్పత్రికి బాబుజగ్జీవన్‌రాం ఆస్పత్రిగా నామకర చేస్తామని చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలాయన్నారు.
దళితుల సమస్యలు పరిష్కరిస్తామని దరఖాస్తులు స్వీకరించడమే తప్ప ఇప్పటికీ ఒక్కదానిని కూడా పరిష్కరించలేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీకి కొత్త కమిటీని ఏర్పాటుచేస్తామని మరిచిపోయారని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనానికి నిధుల కేటాయించడంతోపాటు మిగతా వాటిని పరిష్కరించకపోతే ఏప్రిల్ 14 తర్వాత కలెక్టరేట్‌ను ముట్టడించనున్నట్లు హెచ్చరించారు. సమావేశంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మేడిమహేశ్, సముద్రాల అజయ్, కోండ్ర సంపత్, లింగంపల్లి శ్రీనివాస్, కుక్క మల్లయ్య , సుధాకర్, కొయ్యడ వినోద్, సిరిసిల్ల నర్సయ్య, రవీందర్, రాజేశం పాల్గొన్నారు.