మంత్రి కేటీఆర్ అమెరికా షెడ్యూలు

9mqdlprsరేపు అమెరికాకు బయలుదేరనున్న రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ షెడ్యూలు ఖరారైంది. ఎల్లుండి నుంచి ఈ నెల 16 వరకు ఆయన బిజీగా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక్కపూట కూడా ఖాళీ లేకుండా ఆయన పర్యటన షెడ్యూలుని రూపొందించారు. ఈ నెల 6న వాషింగ్టన్ డీసీలో ఇండియన్ అంబాసిడర్ తో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం న్యూయార్క్ కు వెళ్తారు. ఈ నెల 7న డీఈ షా, ఇతర వ్యాపారవేత్తలతో సమావేశమవుతారు. అదే రోజు సాయంత్రం న్యూజెర్సీలో జరిగే ఎన్నారైల కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరవుతారు. ఈ నెల 8న ఉదయం పిట్స్ బర్గ్ కు ప్రయాణమవుతారు. అక్కడ మెలాన్‌ యూనివర్సిటీ ఫ్యాకల్టీ, సీఈవోతో భేటీ అవుతారు. మే 9న డల్లాస్‌ కు వెళ్తారు. పలువురు వ్యాపారవేత్తలతో బ్రేక్‌ ఫాస్ట్‌, లంచ్‌ మీటింగుల్లో పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం ఎన్నారైలతో సమావేశం అవుతారు. మే 10న శాన్‌ ఫ్రాన్సిస్కోకు వెళ్తారు. మే 11న పాలో ఆల్టోలో జరిగే మేకిన్‌ ఇండియా ఈవెంట్‌ లో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత గూగుల్‌ ప్రతినిధులతో సమావేశం అవుతారు. మే 12న సోషల్‌ ఇంపాక్ట్‌ ఇన్వెస్టర్స్‌, వ్యాపారవేత్తలతో భేటీ అవుతారు. మే 13న స్టాన్‌ ఫోర్డ్‌ యూనివర్సిటీని సందర్శిస్తారు. మే 14న ఫిక్కీ ఇంటరాక్టివ్‌ సెషన్‌ లో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. మే 15న టైకాన్‌ కాన్ఫరెన్స్ కు హాజరై, సిస్కో సీఈవో జాన్‌ చాంబర్స్ తో భేటీ అవుతారు. మే 16న టెలికాం-నెట్‌వర్క్‌ కంపెనీ ప్రతినిధులను కలుస్తారు. అదే రోజు సాయంత్రం ఎన్నారైలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారు.