మంత్రి కొప్పుల సమక్షంలో పార్టీలో చేరికలు
హుజూరాబాద్,అగస్టు16(జనంసాక్షి): జమ్మికుంట పట్టణంలోని కొత్తపల్లిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. సుమారు 300 మందికి పైగా కార్యకర్తలు మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో సగం మంది మహిళలు ఉన్నారు. వీరందరికి మంత్రి కొప్పుల గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావు, టీఆర్‌ఎస్ నాయకులు కృష్ణమోహన్ రావు, సమ్మిరెడ్డి, కౌన్సిలర్ సదానందంతో పాటు పలువురు పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో మారుతి రెడ్డి, కిరణ్, వినయ్, అశోక్, సలీం, శేఖర్, సారయ్య, మల్లయ్య తదితరులు ఉన్నారు.