మంత్రి గన్‌మన్‌పై విచారణకు ఆదేశం
కరీంనగర్, న్యూస్: ‘గన్‌మన్ గలీజ్‌ప లీలలు’ పేరిట ‘జనంసాక్షి’ ప్రచురించిన కథనానికి స్పందన వచ్చింది. మహిళతో వివాహేతర సంబంధం నెరుపు తూ పోలీసులకు పట్టుబడ్డ మంత్రి శ్రీధర్‌బాబు గన్‌మన్ శ్రీనివాస్ తీరుపై విచారణకు ఎస్పీ రవీందర్ ఆదేశాలు జారీ చేశారు. సదరు గన్‌మన్‌తో పోలీసులకు పట్టుబడ్డ మహిళ భర్త వెంకటేశ్ వారిరువురి తీరుపై ఆదివారం త్రీటౌన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీనివాస్‌తో పాటు మహిళపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇద్దరు ప్రభుత్వోద్యోగులు కావడంతో కోర్టు ఆదేశాల అనంతరం వారిపై కేసు నమోదు చేయనున్నట్లు తెలిసింది. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు శ్రీనివాస్ ఆగడాలపై పూర్తి స్థాయిలో విచారించి శనివారం జరిగిన సంఘటనపై త్రీటౌన్ సీఐ విజయ్‌రాజ్‌కుమార్ నివేదిక పంపినట్లు సమాచారం.
మంత్రి ఆగ్రహం…
వివాహేతర సంబంధం నేపథ్యంలో పట్టుబడ్డ గన్‌మన్ శ్రీనివాస్ వ్యవహారంపై మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డట్లు సమాచారం. తన వద్దే విధులు నిర్వర్తిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న అతడిపై అధికారులు వ్యవహరిస్తున్న తీరుపట్ల మంత్రి అసహనాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. జరిగిన సంఘటనతోపాటు అతడు నిర్వహించిన పలు వ్యవహారాలపై విచారణ చేపట్టి శాఖాపరమైన చర్యలు చేపట్టాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించినట్లు సమాచారం.
సాక్షి కథనం స్ఫూర్తితోనే ఫిర్యాదు
‘సాక్షి’ కథనంతోనే తనకు ధైర్యం వచ్చి శ్రీనివాస్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మహిళ భర్త వెంకటేశ్ చెప్పారు. తన కుటుంబంలో నెలకొన్న పరిస్థితులను వెలుగులోకి తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.