మంత్రి పదవుల కోసం కారెక్కిన నేతలా… మునుగోడులో ప్రచారం చేసేది : శ్రీరాములు యాదవ్
టీఆర్ఎస్ అభ్యర్థికి అభివృద్ధి చేసే సత్తా లేక మంత్రి కేటీఆర్ దత్తత తీసుకుంటారా?
రాజగోపాల్ రెడ్డి లాగా రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో నిలబడే దమ్ము కారెక్కిన నేతలకు ఉందా ?
చండూరు, నాంపల్లి మండలంలో ముఖ్య కార్యకర్తలతో శ్రీరాములు యాదవ్ భేటీ – టీఆర్ఎస్ నేతలపై తీవ్ర ఆగ్రహం.
ఎల్బీ నగర్ (జనం సాక్షి )టీఆర్ఎస్ నాయకులు ఏ మోఖం పెట్టుకుని మునుగోడు ఎన్నికల ప్రచారానికి వస్తున్నారో అర్థం కావడం లేదని మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి, నాంపల్లి మండలం సహా ఇన్ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్ మండిపడ్డారు. గురువారం చండూరు, నాంపల్లి మండలం నేరేళ్లపల్లి గ్రామాల్లో ఓటర్లు, స్థానిక బీజేపీ నాయకులతో మునుగోడు నియోజకవర్గం కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి, రఘుపతి రెడ్డి సిహెచ్ పీ వెంకట్రెడ్డి తో కలిసి సమావేశం అయ్యారు శ్రీరాములు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు.
మును”గోడు’ గోసకు 8 ఏళ్ల టీఆర్ఎస్ పాలన కారణం కాదా అని ప్రశ్నించారు.
గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గం దత్తత తీసుకుంటానని… ప్రతీ 3 నెలలకు వచ్చి అభివృద్ధిని సమీక్షిస్తానని ప్రజలను మభ్య పెడుతున్నారని విమర్శించారు.
టీఆర్ఎస్ అభ్యర్థికి అవగాహన, సత్తా లేదని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలతో మునుగోడు ప్రజానీకానికి అర్థమైందని అందెల శ్రీరాములు చెప్పారు.
మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేసి మళ్లీ ప్రజాక్షేత్రంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిలబడ్డారని గుర్తు చేశారు.
కాంగ్రెస్, టీడీపీ నుంచి మంత్రి పదవుల కోసం కారెక్కిన నాయకులు…. ఎందుకు రాజీనామా చేసి మళ్లీ ప్రజా ఆమోదం పొందలేదని ప్రశ్నించారు అందెల. సీఎం కేసీఆర్ మోచేతి నీళ్లు తాగేందుకు గులాబీ గుటికి చేరిన నాయకులు, మంత్రులా… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని విమర్శించేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అందెల శ్రీరాములు యాదవ్.
పార్టీ మారి పదవులు పొందిన టీఆర్ఎస్ నాయకులు ప్రచారానికి వస్తే గట్టిగా నిలదీయాలని మునుగోడు నియోజకవర్గం ఓటర్లు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు శ్రీరాములు.