మంత్రి మల్లారెడ్డి పై ప్రజల ఆగ్రహం

మంత్రి మల్లారెడ్డి పై ప్రజల ఆగ్రహం
ప్రాణాంతకంగా మారిన ప్రధాన రహదారి
ప్రాణాలతో చెలగాటమా అనే విమర్శలు
త్వరితగతిన పనులు పూర్తి చేయాలని డిమాండ్
కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) జూన్ 23 :- ప్రధాన రహదారి ప్రాణాంతకంగా మారిందని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మంత్రి మల్లారెడ్డి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ప్రజా సమస్యల పై ఎలాంటి శ్రద్ధ చూపకుండా గొప్పల కోసం తిప్పలు పడుతున్నారని ఆరోపిస్తున్నారు రోడ్డు పనులు ప్రారంభించి సంవత్సరం కాలం గడిచినప్పటికీ నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో ప్రజలు సతమతమవుతున్న చీమకుట్టినంత కూడా చలనం లేకుండా పనులు పూర్తిచేసే విషయంలో నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆక్రోశానీకి గురవుతున్నారు ఇప్పటికైనా మంత్రి మల్లారెడ్డి తో పాటు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలి సభ్యులు అధికారులు రోడ్డు నిర్మాణం విషయంలో అశ్రద్ధ వహించకుండా త్వరితగతిన పనులు పూర్తి చేసి రోడ్డు సమస్య నుండి ప్రజలకు విముక్తి కలిగించాలని లేనియెడల ప్రజలు తగిన గుణపాఠం చెబుతారనే హెచ్చరికలు ప్రజల నుండి వెలువడుతున్నాయి
Attachments area