‘మంత్రి వకాల్తా పుచ్చుకోవడం దారుణం’
హైదరాబాద్, జనంసాక్షి: మనీ ల్యాండరింగ్ విషయంలో సమగ్ర దర్యాప్తు జరపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఓబాధ్యత గల మంత్రి వకాల్తాపుచ్చుకోవడం దారుణమని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
త్వరలోనే విద్యార్థులతో మేథోమధున సదస్సుకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతారని ఆయన తెలిపారు. పార్టీలో కార్యవర్గ కూర్పు, అసంతృప్తి నేతలను బుజ్జగిస్తున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.