మంత్రి సత్యవతి ని అడ్డుకున్న టీఆర్ఎస్ శ్రేణులు.

ములుగు బ్యూరో,సెప్టెంబర్20(జనం సాక్షి):-
మంగళవారం రోజున ములుగు జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రి సత్యవతి రాథోడ్ ను ములుగు జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఎస్సి సెల్  ఆధ్వర్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ ని దళితులు గట్టమ్మ దగ్గర అడ్డుకున్నారు.వర్షంలో దళితులు ములుగు గడ్డ పైన
అడుగు పెట్టొద్దు అని నినాదాలు చేశారు.
జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ మంత్రి సత్యవతి రాథోడ్ కాళ్ళు పట్టుకొని దళితుల కోసం న్యాయం చేయాలని వేడుకున్నారు.
ఎంపీ కవిత ఎంపీ ఎలక్షన్లలో కార్యకర్తలను ఏమి చేసింది..మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లాకు వచ్చి ఏమి చేసింది.
ఉమ్మడి జిల్లా అయిన
మంత్రులు అందరూ కలిసి ములుగు ఎమ్మెల్యే తో సమాధానం పడటం ఏంటి…
మీ రహస్య ఒప్పందాలు ఏమిటి…
కార్యకర్తలకు వివరించాలి అని పట్టు పట్టారు.వర్షం సైతం లెక్క చెయ్యకుండా టీఆర్ఎస్ శ్రేణులు మంత్రి సత్యవతి రాథోడ్ అడ్డుకున్నారు.