మంత్రుల పర్యటనను విజయవంతం చేయాలి – ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

హుజూర్ నగర్ జూన్ 23 (జనం సాక్షి): హుజూర్ నగర్ లో ఈనెల 29న మంత్రి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలని స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కోరారు. మంత్రులు కేటీఆర్ తో పాటు  జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్ లు  పర్యటించబోతున్నారని తెలిపారు. గురువారం ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా తాను గెలిచిన తర్వాత అభివృద్ధి ఎంత జరిగిందో, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఎంత అభివృద్ధి చేశారో ప్రజలకు వివరించాలన్నారు. ఈనెల  29న మంత్రులు హుజూర్ నగర్ లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, బంజారా భవన్, ఈఎస్ఐ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొంటారని తెలిపారు. ఉప ఎన్నికల సమయంలో సీఎం కెసిఆర్ ఇచ్చిన ప్రతీ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారన్నారు. సుమారు రూ. 3500 కోట్ల అభివృద్ధి  హుజూర్ నగర్ నియోకవర్గ స్థాయిలో అభివృద్ధి చేసి చూపించామన్నారు. ప్రత్యేకించి హుజూర్ నగర్ లో రహదారుల నిర్మాణం పూర్తి చేయించాం అన్నారు. ఉత్తమ్ చేసిన రచ్చ బండ కార్యక్రమం రచ్చ రచ్చ లానే తయారయింది అన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి  జరుగుతుంటే చూసి తట్టుకోలేక  కోర్టు కేసులతో అడ్డుకుంటున్నారన్నారు. ఉత్తమ్ హయాంలో ఎన్ఎస్పీ క్యాంప్ అన్యాక్రాంతం అయ్యింది అన్నారు. ఎన్నికల కోసం ఓట్ల రాజకీయం చేయడం నాకు చేతకాదు అన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ని నమ్మే పరిస్థితి లేదన్నారు. రాజకీయాలు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే  చేయాలని, అభివృద్ధి సమయంలో రాజకీయాలకు అతీతంగా పని చేయాలన్నారు. ఈ పర్యటనలో టిఆర్ఎస్ శ్రేణులు ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో  వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనారవి,  జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
2 Attachments