మందమర్రిలో 144 సెక్షన్‌

ఆదిలాబాద్‌: మందమర్రి కేకే2 ఉపరితల గనిని వ్యతిరేకిస్తూ ప్రజాఫ్రంట్‌ నేతలు నేడు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సింగరేణి జీఎం కార్యాలయ ముట్టడికి బయలుదేరిన 8 మంది నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మందమర్రి మండలంలో 144 సెక్షన్‌ను విధించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.