మందుబాబులపై కేసులు నమోదు

హైదరాబాద్‌,జనవరి19(జ‌నంసాక్షి): జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించారు. వారాంతం కావడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పలువురు మందుబాబులు పట్టుబట్టారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో భాగంగా మద్యం తాగి వాహనాలు నడిపిన 62 మందిపై కేసులు నమోదు చేసి, వారి వాహనాలను పోలీసులు సీజ్‌ చేశామని పోలీసులు వెల్లడించారు.