మట్టి వినాయకులను పూజించాలి.
ఎస్పీ రాహుల్ హెగ్డే.
మానేరు స్వచంద సంస్థ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ.
రాజన్నసిరిసిల్ల బ్యూరో, ఆగస్టు 30 (జనం సాక్షి). పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులను పూజించాలని ఎస్పి రాహూల్ హెగ్డే అన్నారు. మంగళవారం మానేరు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని ఎస్పి రాహూల్ హెగ్డే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయనాలు వాడిన విగ్రహాల వల్ల పర్యావరణం దెబ్బతింటుందని అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మట్టి వినాయకులను పూజించాలని సూచించారు. మట్టి వినాయకులను ఉచితంగా అందిస్తున్న మానేరు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో మానేరు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు చింతూరు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ము