మడేలయ్య ఆలయానికి విగ్రహాలు అందజేత.

దండేపల్లి,జనంసాక్షి.అక్టోబర్20 దండేపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో రజక సంఘం అధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న మడేలయ్య ఆలయ విగ్రహాలకు నగదును నరనారాయణ స్వామి ఆలయ వ్యవస్థాపకురాలు లింగాల శ్రీమతి ప్రకాశ్ రావులు గురువారం అందజేశారు. రూ 80 వేల విలువైన విగ్రహాలను అందిస్తున్నట్లు రజక సంఘం అధ్యక్షుడు మందపెల్లి వెంకటేశ్ తెలిపారు.ఈ కార్యక్రమం లో రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.