మతుసంఘం గండిపేట్ గ్రామాలలో ఆసరా పెన్షన్ అందజేత ఎమ్మెల్యే జాజాల సురేందర్
గాంధారి జనంసాక్షి సెప్టెంబర్ 26
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మతూ సంగం గ్రామంలో మతు సంగం, పేట్ సంగం, కాయితి తాండ, గుడివెనుక తాండ, పర్మల్ల తాండ, రాంలక్ష్మణ్ పల్లి, వండ్రికల్, జువ్వాడి, మాధవపల్లి, 9 గ్రామాలకు సంబంధించిన నూతనంగా పెన్షన్ మంజూరైన లబ్ధిదారులకు ఆసరా గుర్తింపు కార్డులు & నూతన పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్ మరియు గండిపేట్ గ్రామంలో నూతనంగా 85 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును మరియు 15 లక్షల నిర్మించిన మార్కెట్ యార్డ్ 22 లక్షలతో నిర్మించిన రైతు వేదిక మరియు గ్రామ పంచాయతీ వద్ద నూతన మహాత్మా గాంధీ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం లో పాల్గొని నూతన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందజేయడం జరిగింది
మతూసంగం గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, బహుజన వర్గాల స్ఫూర్తి ప్రదాత, మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా వారికి పూలమాల వేసి నివాళులర్పించిన
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
బీజేపీ పాలిత రాష్ట్రం లో 600 రూపాయలు పెన్షన్ ఉంటే తెలంగాణ రాష్ట్రం లో 2016 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు
తెలంగాణ రాష్ట్రము లో పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్తగా 10లక్షల పింఛన్లను మంజూరు చేయడం జరిగిందన్నారు అర్హులైన వారికి కొత్త పింఛన్లు అందించడం జరుగుతుందని అన్నారు
భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ లో 1గుంట భూమి ఉన్న రైతు మరణిస్తే 5 లక్షల రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే
తెలంగాణ రాష్టంలో తాండలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్ ది అన్నారు
దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ లో రైతు బంధు పథకం ఎకరానికి సంవత్సరానికి 10 వేల చొప్పున అమలు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే
తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే వర్గాల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడలేని పథకాలను అమలు చేసిన ఏకైక రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు
దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు రైతు వేదిక భవనం నిర్మాణం చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంమన్నారు
కళ్యాణ లక్ష్మి, షాది ముభారక్ దేశానికి ఆదర్శం
మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారున్నారు కాబట్టే సంక్షేమ ఫలాలు పేదలకు దక్కుతున్నాయి
కళ్యాణలక్ష్మీ, కేసీఆర్ కిట్, ఆసరా, 24గంటల ఉచిత కరెంటు, రైతుబందు, దళితబందు కేసీఆర్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలు ఎన్నో
మోడీ పాలించిన గుజరాత్లో, బిజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ లాంటి సంక్షేమ పథకాలు ఎందుకు లేవు
బిడ్డ పెండ్లీ కోసం ఆస్థులమ్ముకున్న గతం తెలంగాణది
తెలంగాణ ఆడబిడ్డలు మన ఆస్థి. వారి పెండ్లి మొదలు కాన్పు, చదువులు బ్రహ్మండంగా చూస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్
పేదల సంక్షేమం కోసం పని చేస్తున్న ప్రభుత్వం మాది
అర్హులైన ప్రతి పేదవాడికి ఇస్తాం, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
మాకు కులం లేదు మతం లేదు పెద్దలందరికి భరోసా ఇవ్వడమే మా ప్రభుత్వ లక్ష్యం
ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, లబ్దీదారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు
Attachments area
|