మత్తుపై యుద్దం ప్రకటించాల్సిందే !
ఉభయ తెలుగు రాష్టాల్రతో పాటు దేశంలో గంజాయి, మాదక ద్రవ్యాల వ్యవహారం ఒక్కసారిగా కలకలం రేపుతోంది. మత్తుకు బానిసలు అవుతున్న వారు కొందరైతే మత్తులో యువతను ముంచి వ్యాపారంతో కోట్లు సంపాదించాలనుకునేవారు కొందరు. వీరంతా ఇప్పుడు దేశంలో మూలమూలనా విస్తరించి యువతను చిత్తుచేస్తున్నారు. ఒకప్పుడు పంజాబ్‌కు మాత్రమే పరిమితమై మత్తు వ్యాపారం ఇప్పుడుదేశమంతా విస్తరిం చడం ఆందోళన కలిగిస్తోంది. ప్రముఖ నటుడు షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ వ్యవహారం చూస్తే యువతను ఎలా మత్తులోకి దింపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. డ్రగ్స్ వ్యవహారంలో సినీ ప్రముఖులను విచారిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో గంజాయి అక్రమ రవాణా మరింత ఆందోళన కలిగిస్తోంది. దీనిని ఇప్పుడు వ్యాపారంగా చేసుకుని కొందరు పబ్బం గడుపుకుంటున్నారు. ఎపిలో గంజాయి, డ్రగ్స్ వ్యవహారం పై గతకొంత కాలంగా టిడిపి చేస్తున్న ఆరోపణలను ప్రభుత్వం, పోలీసులు కొట్టి పారేస్తున్నారు. టిడిపి విమర్శలను సహేతుకంగా తీసుకుని గంజాయి రవాణాపై దృష్టి సారించాల్సిన డిజిపి సైతం విమర్వలకు దిగడం, టిడిపి ఆరోపణలను కొట్టి పారేయడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి. ఇది ఓ రకంగా మత్తు వ్యాపారాలకు ఊతం ఇచ్చేలా ఉంది. గంజాయి,డ్రగ్స్ అక్రమ రవాణా జరక్కుండా, యువత బానిస కాకుండా చర్య తీసుకోవాల్సి ఉంది. తెలంగాణ సిఎం అత్యవసరంగా సమావేశం నిర్వహించి మాదక ద్రవ్యాల రవాణా, వ్యాపారాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఇందుకు పోలీస్ శాఖను, ఎక్జైజ్ శాఖను అప్రమత్తం చేశారు. గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం వల్ల దానిని సేవించిన వారి మానసిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉంటుంది. అమాయక యువత తెలిసీ తెలియక దీని బారిన పడుతోంది. మాదకద్రవ్యాల వినియో గాన్ని మాన్పించడం చాలా క్లిష్టమైన, సుదీర్ఘమైన పక్రియ. అందువల్ల వీటి వినియోగంపై పూర్తిస్థాయిలో ఉక్కుపాదం మోపాల్సిన అవసరం పాలకులపై ఉంది. మత్తు పదార్థాల వినియోగంతో వచ్చే అనర్దాల గురించి, యువతకు తెలిసేలా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలి. యువకుల్లో అవగాహన, పరిణతి కలిగించేలా, గొప్ప ప్రభావం చూపించే విధంగా అద్భుతమైన రీతిలో ప్రచార కార్యక్రమాలు కొనసాగాలి. గతంలో ఎయిడ్స్ వ్యాధిపై ఉధృత ప్రచారంతోనే ఆ మహమ్మారిపై ప్రజల్లో అవగాహన కల్పించ గలిగాం. పోలీస్, ఎక్సైజ్ శాఖలు సమన్వయంతో పటిష్టమైన వ్యూహం రూపొందించుకొని, గంజాయి, గుడుంబాలను సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఏర్పడిరది. ఆంధ్రా`ఒడిశా సరిహద్దు ఏఓబీ ప్రాంతంలో గంజాయి సాగు జరుగుతున్నది. అక్కడి నుంచి చింతూరు,భద్రాచలం విూదుగా రాష్ట్రంలోకి ప్రవేశించి, మహారాష్ట్ర, కర్ణాటక రాష్టాల్రకు రవాణా జరుగుతున్నట్లు ఎక్సైజ్, పోలీసు అధికారులు గుర్తించారు. ఇటీవల పట్టుబడిన కేసులను పరిశీలిస్తే ఇది స్పష్టం అవుతోంది. మన్యంలో గిరిజనులను మోసం చేసి కొందరు వారికి డబ్బు ఆశచూపి గంజాయి పండిస్తున్నారు. దీనిని తోణమే అరికట్టాల్సి ఉంది. వారికి ఉపాధి చూపాలి. ఇకపోతే విశాఖ వెళ్లిన నల్లగొండ పోలీసులుపై దాడులకు తెగించారు. దీన్ని అరికట్టేందుకు అన్ని రాష్టాల్ర పోలీసు, ఎక్సైజ్ శాఖలతో సమన్వయ వ్యవస్థ అవసరముందని తెలంగాణ పోలీసులు పేర్కొన్నారు. రాష్ట్రంలోకి ఎక్కువ శాతం గంజాయి ఇతర రాష్టాల్ర నుంచే వస్తోందని, ఛత్తీస్‌గఢ్‌లో సైతం గంజాయి సాగు, సరఫరా జరుగు తోందని సిఎం కెసిఆర్ సవిూక్ష సందర్భంగా తెలిపారు. గంజాయిని వినియోగిస్తున్న వారిలో వలస కూలీలు, యువకులు ఎక్కువగా ఉన్నారు. ఆటో డ్రైవర్లు, హమాలీలు కూడా ఉన్నట్లు గుర్తించారు. గంజాయి, డ్రగ్స్ పీడను త్వరగా తొలగించకపోతే రాష్ట్రం సాధిస్తోన్న ప్రగతి ఫలితాలు నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉంది.
రాష్ట్రంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనే విషయాన్ని తీవ్రంగా పరిగణించాలి. గంజాయి కోసం గ్రూపులుగా ఏర్పడి వాట్సాప్ మెసేజ్‌లు పెట్టుకుని తెప్పించుకుంటున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. గంజాయి వినియోగం పెరుగుతోందని నివేదికలు వస్తున్న నేపథ్యంలో పరిస్థితి అదుపు తప్పక ముందే తీవ్ర యుద్ధం ప్రకటించాల్సిందిగా అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో గమనించవచ్చు. గంజాయి వినియోగంలో హాట్ స్పాట్లుగా మారిన సెంటర్లను వెంటనే గుర్తించి, నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను నిరోధించేందుకు పోలీస్, ఎక్సైజ్ అధికారులకు ఏం కావాలన్నా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గంజాయి మాఫియాను అణచివేయండని, నేరస్తులు ఎంతటి వారైనా ఉపేక్షించాల్సిన అవసరం లేదని సిఎం కెసిఆర్ కూడా గట్టిగానే సూచించారు. గుడుంబా తాగడం వల్ల భర్తలను కోల్పోయి ముక్కు పచ్చలారని గిరిజన యువతులు వితంతు వులుగా మారుతున్నారు. రాష్ట్రంలో గుడుంబా నిషేధాన్ని సమర్థంగా అమలు చేస్తున్నారు. గంజాయిని నిరోధించేందుకు డీజీ స్థాయి పోలీసు అధికారి నేతృత్వంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దాని ఉత్పత్తిని సమూలంగా నిర్మూలించేందుకు అవసరమైన సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని కెసిఆర్ సూచించారు. ప్రధానంగా గంజాయి సాగును, రవాణా, వినియోగాన్ని అరికట్టే విషయంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ కీలకంగా వ్యవహరించాలి. చీమ చిటుక్కుమన్నా తెలిసే విధంగా ప్రత్యేకంగా ఆధునిక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. గంజాయి రాకుండా ఆపే విధంగా పటిష్టమైన వ్యూహం అవలంబించాలి. తమ గ్రామాల్లో గంజాయి సాగు అవుతున్నట్లయితే, ఆయా గ్రామాల సర్పంచ్‌లు సమాచారాన్ని ఎక్సైజ్, పోలీసు శాఖలకు అందించేలా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలి.గుడుంబా, గ్యాంబ్లింగ్ మళ్లీ కనిపి స్తున్నాయి. గుడుంబా తయారీ మళ్లీ మొదలవుతున్నట్లు వస్తున్న సమాచారాన్ని బట్టి ఎక్సైజ్ అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. గుడుంబా అమ్మకం విూద ఆధారపడి జీవిస్తున్న వారికి ప్రత్యామ్నాయ ఉపాధి, పునరావాసం కల్పించాలి. గంజాయిని మొగ్గలోనే తుంచకపోతే మొత్తం సమాజమే నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉంది. ఇది అన్ని ఇతర వ్యాపారాలకన్నా డేంజర్‌గా గుర్తించి ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైంది. కెసిఆర్ అన్నట్లు యుద్దం ప్రకటిస్తే తప్ప అరికట్టలేం.