మత్స్యకారులు వ్యాపారులుగా ఎదగాలి: తలసాని

హైదరాబాద్‌,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి): చేపల ఉత్పత్తితో పాటు మార్కెటింగ్‌ కూడా చేసి మంచి వ్యాపారులుగా ఎదగాలని.. అదే సీఎం కేసీఆర్‌ ప్రధాన ఆకాంక్ష అని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ అన్నారు. సవిూకృత మత్స్యాభివృద్ధి పథకానికి ఎంపికైన మత్స్యకార్మిలకు రాయితీ యూనిట్ల పంపిణీ చేయడం ద్వారా వారిని ఆదుకుంటున్నామని అన్నారు. కొన్ని సంఘాల నేతలు మంత్రిని కలసి అభినందించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కులవృత్తిదారులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక రకాల పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. మత్స్యకార్మికుల అభివృద్ధికి గాను 2018-19 సంవత్సరానికి రూ.1000కోట్లతో వివిధ రకాల పథకాలను ప్రవేశపెట్టారని, అందులో భాగాంగానే జిల్లాలకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. కార్మికులకు పెట్టుబడి భారం పడకుండా ఉండాలనే ఏకైక ఆశయంతో ఉచిత చేపపిల్లను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉత్పత్తి చేపట్టిన చేపలను స్వయంగా మార్కెటింగ్‌ చేసుకోవాలనే ఉద్దేశంతో భారీ రాయితీపై ద్విచక్రవాహనాలు, లగేజీ ఆటోలు, ఇతర వాహనాలు, వలలు, తెప్పలు అందిస్తున్నట్లు చెప్పారు.  ఈ వాహనాలతో వ్యాపారాలు మంచిగా చేసి ఆర్థికంగా బలపడాలని మంత్రి సూచించారు. కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ మాట్లాడుతూ.. చేపల ఉత్పత్తి చేపట్టే మత్స్య కార్మికులకు ఇన్ని పథకాలు ప్రవేశపెట్టింది తెలంగాణ రాష్ట్రమే అన్నారు. కులవృ త్తులను ప్రోత్సహించి ఆదాయాన్ని సమకూర్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వాహనాలు తీసుకున్న లబ్ధిదారులు బీమా తప్పకుండా
చేసుకోవాలని అన్నారు.