మత్స్యకారుల ఆర్థిక బలోపేతానికే ఉచిత చేప పిల్లల పంపిణీ
సూర్యాపేట (జనంసాక్షి) : మత్స్యకారుల ఆర్థిక బలోపేతానికే సీఎం కేసీఆర్ నూరు శాతం ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టారని మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.సోమవారం సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు పిల్లలమర్రి చెరువులో చేపల పంపిణి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని వివరించారు. గతంలో సాగు నీటి కోసం రైతులు ఎన్నో కష్టాలు చవిచూశారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మంత్రి జగదీష్ రెడ్డి జిల్లాలో సమృద్దిగా నీటి వనరులు సమకూర్చారని చెప్పారు. దేశంలో అన్ని కులాల అభివృద్ధి కోసం సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేసిన ఏకైక ప్రభుత్వం తెరాస దే అన్నారు. జిల్లాలో 222 గ్రామాలకు 77 లక్షల నిధులతో చేపల పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ అధికారి రూపేందర్ సింగ్ , తహసీల్దార్ వెంకన్న నాయకులు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్ బచ్చలికూరి శ్రీనివాస్, టిఆర్ఎస్ వార్డు అధ్యక్షులు చెరుకుపల్లి శ్రీనివాస్, ఈదుల యాదగిరి, రాపర్తి మహేష్ కుమార్, పిల్లలమర్రి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు తూటిపల్లి మహేష్ , మారబోయిన శ్రీను , తూటిపల్లి నాగయ్య తదితరులు పాల్గొన్నారు.