మత్స్య కార్మికుల కుటుంబాలను ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయం.. సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి
రాజుల పైసా రాళ్లపాలు కావద్దు.. సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ, సెప్టెంబర్ 26 (జనంసాక్షి):
మత్స్య కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో వంద శాతం సబ్సిడీతో ఉచితంగా చేప పిల్లలు అందిస్తూ, ఉపాధి కల్పించే విధంగా వారికి ద్విచక్రా వాహనాలు అందించడం జరుగుతుందని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండలంలోని ఇబ్రహీంపేట్ పెద్ద చెరువులో ప్రభుత్వం ద్వారా అందించే 84 వేల ఉచిత చేప విత్తనాన్ని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి చెరువులో చేప విత్తనాల్ని వదిలారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు మత్స్య కార్మికుల కుటుంబాలను పట్టించుకున్న పాపాన పోలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ కులవృత్తులకు కాపాడుకునే దిశగా అడుగులు వేయడం జరిగిందన్నారు . గత ప్రభుత్వంలో మత్స్య శాఖ మంత్రిగా తాను ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్లి ఎన్సీడీసీ ద్వారా అ రుణం తీసుకువచ్చి రాష్ట్ర ప్రభుత్వ తరపున ఉచిత చేప విత్తన సరఫరాను ప్రారంభించడం జరిగిందన్నారు. మత్స్య కార్మికులు దళారుల మాయలో పడి మోసపోకుండా వారి స్వయంగా అమ్ముకునే విధంగా ద్విచక్ర వాహనాలు, బొలెరో వాహనాలు అందించడం జరిగిందని దీంతో మత్స్య కార్మిక కుటుంబాలు వెలుగులు నింపామన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెద్ద చేప పిల్లలను మాత్రమే వదలాలని, సైజు తక్కువ ఉన్న చేప విత్తనాలను సరఫరా చేసినట్లయితే మత్స్య కార్మికులు తిప్పి పంపియాలని, అవినీతికి ఆస్కారం లేకుండా చేయడమే తన లక్ష్యమన్నారు. కులవృత్తుల వారికి వారి సొంత గ్రామాలోనే ఉపాధి పొందే విధంగా అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ముందున్న లక్ష్యమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా గంగపుత్రులు మత్స్య కార్మిక సంఘ భవనానికి ప్రహరీ గోడ అవసరం ఉందని కోరగా పది లక్షల రూపాయలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. చెరువు యొక్క అలుగు పొడవు, తూముల రిపేరు, చెరువులో మెట్ల నిర్మాణ గురించి సభాపతి దృష్టికి తీసుకురావడంతో పనులు త్వరితగతిన పూర్తి చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో జిల్లా రైతుబంధు అధ్యక్షుడు అంజిరెడ్డి, జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకటేశ్వర్లు, డోలి సింగ్,, ఎంపీపీ దొడ్ల నీరజా వెంకటరామిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి,గోపాల్ రెడ్డి,,దేవేందర్ రెడ్డి, తెరాస పార్టీ మండల అధ్యక్షుడు మోహన్ నాయక్,గ్రామ సర్పంచ్ నారాయణ రెడ్డి, ఉప సర్పంచ్ సాయిలు, నారాయణరెడ్డి,దేవరం సాయిరెడ్డి, కో ఆప్షన్ సభ్యులు వస్సి,బండి పండరి, ఇబ్రహీంపెట్ తండా సర్పంచ్ ప్రేమ్ సింగ్, తెరాస మండల ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కామేశ్వర్, సాయిలు, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు రమేష్, సాయిలు,సభ్యులు తదితరులు పాల్గొన్నారు
2 Attachments • Scanned by Gmail
|