మత్స్య గిరింద్రుడు ఉండి లెక్కింపు…
శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 7
శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామం లోని గుట్టపై గల శ్రీ మత్స్య గిరీంద్ర స్వామి దేవస్థానం నుండి లెక్కింపు బుధవారం లెక్కించినట్లు ఆలయ ఇంచార్జ్ ఈవో శ్రీనివాస్ తెలిపారు. శ్రీనివాస్ మాట్లాడుతూ 5 నెలల ఉండి ఆదాయం83,909 వచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ కిషన్ రావు, ఆలయ చైర్మన్ తూముల శ్యామ్ రావు, ఉప సర్పంచ్సంపత్, హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చౌడమల్ల వీరస్వామి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్, దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిశీలకులు, సత్యనారాయణ, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇంచార్జ్ ఈ వో ను తొలగించాలి గ్రామస్తుల డిమాండ్…
శంకరపట్నం మండలం కొత్తగట్టు గుట్టపై గల శ్రీ మత్స్యగిరిద్ర స్వామి దేవస్థానం ఇన్చార్జి ఈ వో నాగారపు శ్రీనివాస్ ను తొలగించాలని కొత్తగట్టు గ్రామస్తులు కోరుచున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మత్స్య గిరింద్ర స్వామి ఈవో శ్రీనివాస్ తన ఇష్టానుసారంగా ఖర్చులు పెడుతూ, ఖర్చుల కంటే ఎక్కువగా బిల్లులు పెట్టి దేవుని ఆదాయాన్ని దిగమింగుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దేవాదాయ శాఖ అధికారులు ఉండి ఆదాయంపై ,జాతర ఆదాయంపై సమగ్ర విచారణ చేసి శ్రీనివాస్ పై తగిన చర్యలు తీసుకొని, ఆలయ అభివృద్ధికి, కృషి చేయాలని గ్రామస్తులు కోరుచున్నారు.