మద్యం వ్యాపారులను ఎన్నికలకు దూరంగా ఉంచాలి
మద్యబహిష్కరణ వేదిక
హైదరాబాద్ : మద్యం వ్యాపారులను రాజకీయాలకు దూరంగా ఉంచాలని స్వచ్ఛంద మద్యబహిష్కరణ వేదిక డిమాండ్ చేసింది. బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రతి ఒక్కరూ మద్య నియంత్రణ ఉద్యమంలో పాలుపంచుకోవాలని హైదరాబాద్ ప్రెన్‌క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోరింది. మద్యవ్యతిరేక ప్రతిన బూనిన 40 వేల మంది విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు కూడా అందజేసింది. మద్యం వ్యాపారులకు ఎన్నికలకు దూరంగా ఉంచేలా రాజ్యాంగ సవరణ చేయాలని కోరుతూ న్యాయమంత్రి కపిల్‌సిబల్‌తో పాట అన్ని రాజకీయ పార్టీ వేదిక సభ్యులు లేఖలు రాశారు.